కేన్సర్ నివారణకు వ్యాక్సిన్ తప్పనిసరి
08-03-2026 05:14 PM
- మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి
- ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యాక్సిన్ ప్రారంభం
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం అందిస్తున్న హెచ్.పీ.వీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతిరమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
గర్భాశయ కేన్సర్ రాకుండా 14 ఏండ్ల లోపు బాలికలు ఈ వ్యాక్సిన్ ను తప్పకుండా వేసుకోవాలని అన్నారు. ఒకసారి టీకా వేసుకుంటే జీవితాంతం రక్షణ ఉంటుందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాగంశెట్టి. సత్యనారాయణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రవి కుమార్, కౌన్సిలర్లు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.




