13 March, 2026 | 12:54 PM

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఘన సన్మానం

08-03-2026 05:18 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోడూరి సాయగౌడ్, ఉప సర్పంచ్ చైతన్య కొండల్ రెడ్డి పాల్గొని మహిళలకు శాలువాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు, మాజీసొసైటీ  చైర్మన్ బాలాగౌని రాజాగౌడ్,ఈశ్వర్ రెడ్డి,బాబాగౌడ్, తో పాటు  పలువురు నాయకులు, గ్రామస్తులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య జరిగింది.