14-08-2024 01:07:55 AM
ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): ప్రధాని మోదీ సర్కార్ ఏకపక్ష నిర్ణయాలపై దేశవ్యాప్తంగా ఉద్యమించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. బీజేపీ మైనారిటీల మనోభావాలను దెబ్బతీసి వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణపై అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నదని మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, జూన్‌లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశాలపై సమీక్ష చేసినట్టు తెలిపారు.
పార్టీ బలోపేతంపై చర్చ జరిగిందని, బీజేపీ సర్కార్‌పై పోరాటం చేసేందుకు దేశవ్యాప్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని, అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్‌ల నుంచి అభిప్రాయాలు తీసుకున్నట్టు వివరించారు. కులగణన అంశాన్ని పార్లమెంట్‌లో కాంగ్రెస్ లెవనెత్తిందని, అవినీతి రహిత పాలన అంటూ బీజేపీ గొప్పలు చెప్తున్నదని షర్మిల మండి పడ్డారు.