18-07-2025 12:04:23 AM
డీసీసీ అధ్యక్షుల నియామక బాధ్యతలు అప్పగింత
హైదరాబాద్, జులై 17 (విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ నేత వంశీచంద్‌రెడ్డికి ఏఐసీసీలో కీలక పద వి లభించింది. ఏఐసీసీ ఇన్‌ఛార్జీగా దేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలకమైన డీసీసీల నియామక బాధ్యతలను పార్టీ అధిష్ఠానం అప్పగించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు ఇచ్చారు. డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియతో పాటు వారి పనితీరు, సంస్థాగత నైపుణ్యాన్ని అధ్యయనం చేయనున్నారు. వంశీచంద్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించడంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.