26 August, 2026 | 2:13 AM

వన మహోత్సవం ఉద్యమంలా చేపట్టాలి

26-08-2026 12:05 AM

నిర్మల్, ఆగస్టు 25 ( విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా లో నిర్వహిస్తున్న వనమోహత్సవాన్ని ఉద్యమంలో చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ వెంక టేశ్వర్లు చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ బాసర్ సర్కిల్ అధికారి అపర్ణ అన్నారు. సారంగాపూర్ మండలంలోని అడెల్లి పోచమ్మ ఆలయం వద్ద హరితవనంలో వనము ఉత్సవంలో పె ద్ద ఎత్తున ముక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ఈ మొక్కలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.

ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లాలో ఎక్కువగా అడవులు ఉండటం వలన వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. చెట్లు నరకడం వల్ల అనర్థాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి ఆ మొక్కను చెట్టుగా మారేవరకు పెంచవలసిన బాధ్యత గుర్తుంచుకోవాలని సూచించా రు. జిల్లాలో నిర్దేశించిన లక్ష మేరకు మొక్క లు నాటడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ ప్రశాంత్ సుఖదేవ్ బొబ్బిడే జిల్లా ఎస్పీ జానకి షర్మిల, డి ఆర్ డి ఓ విజయలక్ష్మి డీఎస్పీ శ్రీనివాస్ అధికారులు ఉన్నారు.

 వన మహోత్సవం కార్యక్రమం పర్యావరణ సంరక్షణకు దోహదం చేస్తుంది: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు

 మంగళవారం సారంగాపూర్ మండలంలోని ఆడెల్లి పోచమ్మ హరితవనంలో వనమ హోత్సవం కార్యక్రమంలో భాగంగా భారీ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.   ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ జా నకి షర్మిల, చీఫ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ బాసర సర్కిల్ అపర్ణ, డిఎఫ్‌ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడేలతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు మా ట్లాడుతూ, వన మహోత్సవం కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని అన్నా రు.

మనమంతా ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవనం కొనసాగించాలంటే తప్పని సరిగా మొక్కలు నాటాలని అన్నారు. మొక్క లు నాటడం ఎంత ముఖ్యమో, నాటిన మొ క్కలను సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. మొక్కలు నాటి పచ్చద నాన్ని పెంపొందించాలని చెప్పారు. మొక్క లు నాటడం వల్ల పచ్చదనం పెంపొందించడమే కాకుండా, ప్రకృతితో బంధాన్ని పెం చుకోవడానికి దోహదపడుతుందని తెలిపా రు. మొక్కలు నాటడానికి కేవలం ఒక కార్యక్రమంలా కాకుండా ఒక యజ్ఞంలా చేపట్టి భావితరాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించాలన్నారు.

 ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి:జిల్లా ఎస్పీ జానకి షర్మిల

   ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు బా ధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చా రు. విద్యార్థులు చిన్ననాటి నుండే పర్యావరణ పరిరక్షణ బాధ్యతను తీసుకోవాల న్నారు. మనం నాటిన మొక్కలు తరతరాల కు ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు.

విరివిగా మొక్కలు నాటడం వల్ల కా లుష్యాన్ని కూడా తగ్గించిన వారమవుతామ ని తెలిపారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడితేనే మానవాళికి మనుగడ ఉంటుందని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కంకణ బదులు కావాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు మహిళా సం ఘాలు భాగస్వామ్యం కావాలని చెప్పారు.

అటవీ విస్తీర్ణ లక్ష్యం పెంచేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందివ్వాలి:చీఫ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ బాసర సర్కిల్ అపర్ణ

అటవీ విస్తీర్ణం పెంచేందుకు ప్రతి ఒక్క రూ సహకారం అందించాలని సిసిఎఫ్ బాసర సర్కిల్ అపర్ణ తెలిపారు. భౌగోళికంగా అటవీ ప్రాంతం 33 శాతం ఉండా లని, అప్పుడే పర్యావరణ సమతుల్యత ఉం టుందని అన్నారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నా టి, వాటిని రక్షించాలని కోరారు. పిల్లల పుట్టినరోజులు, వివాహ దినోత్సవాలు, తదితర శుభకార్యాల సందర్భంగా అతిధులకు మొక్క లు బహుమతులుగా ఇవ్వాలన్నారు. జిల్లా లో ఇప్పటికే వన మహోత్సవం కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతుందని తెలిపారు. 

  సింగిల్ యూసేజి ప్లాస్టిక్ ను వాడకుండా ఉండి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని వివరించారు.కళాజాత బృందాలు పర్యావరణ పరిరక్షణ, చెట్లు పెంచడం వల్ల కలిగే లాభాలను సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా వివరించారు. అనంతరం అధికారులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు కలిసి భారీగా మొక్కలను నాటారు. 

  ఈ వనమహోత్సవం కార్యక్రమంలో డిఆర్డిఓ విజయలక్ష్మి, డీఎస్పీ శ్రీనివాస్, ఎంపీడీవో లక్ష్మీకాంతరావు, ఎంపీఓ అజీజ్ ఖాన్, సర్పంచ్ లు కూనేరు భూమన్న, దండు సాయన్న, స్థానిక ప్రజలు, విద్యార్థులు, అటవీ శాఖ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.