కాంగ్రెస్‌లో చేరిన వంగ లక్ష్మణ్ గౌడ్
11-05-2024 01:42 AM
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): జనసేన తెలంగాణ యువ జన విభాగం అధ్యక్షుడు వంగ లక్ష్మణ్ గౌడ్ శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గత కొంత కాలంగా లక్ష్మణ్ గౌడ్ జనసేనలో క్రీయాశీలకంగా పని చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయగా.. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేయడం లేదు. దీంతో తన రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్‌లో చేరినట్లు తెలుస్తోంది.






