23-08-2025 12:00:00 AM
పాల్గొన్న ఎమ్మెల్యే విజయుడు
అలంపూర్, ఆగస్టు 22: పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర 2025 కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయుడు స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు.ఈ మేరకు శుక్రవారం రాజోలి మండలంలోని పచ్చర్ల గ్రామంలో రూ.20 లక్షల నిధులతో గ్రామపంచాయతీ భవనం,రూ.8 లక్షలతో అంగన్వాడీ కేంద్రం, పెద్ద ధన్వాడ గ్రామంలో రూ.20 లక్షలతో గ్రామపంచాయతీ భవనానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
అదేవిధంగా మానవపాడు మండల పరిధిలోని చంద్రశేఖర్ నగర్ గ్రామంలో రూ.92,000 నిధులతో క్యాటిల్ షెడ్ నిర్మాణం కొరకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో నాగేంద్రం, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కుమార్, ఆలయ ధర్మకర్త విశ్వనాధ రెడ్డి,ఎంపీడీవోలు భాస్కర్,రాఘవ, నాయకులు దస్తగిరి పర్చర్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.