calender_icon.png 23 August, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ రంగంతోపాటు పాడి పరిశ్రమ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

23-08-2025 12:00:00 AM

  1. ముమ్మరంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
  2. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్దిదారులకు నూతన వస్ట్రాలను అందజేత 
  3. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కోనరావుపేట ఆగష్టు 22 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేట మం డలం వ్యవసాయ రంగంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యే క దృష్టి సారించిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మ కంగా చేపడుతున్న పనుల జాతరలో భా గంగా రాజన్న సిరిసిల్ల జిల్లా షెడ్యూల్ కు లాల సహకార సంఘం వారి ఆధ్వర్యంలో కోనరావుపేట మండలం ఎగ్లాస్ పూర్ గ్రా మంలో లబ్దిదారులకు పాడి గేదెల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై గెదలను పం పిణీ చేశారు..

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. గ తంలో ప్రతి గ్రామంలో పశు సంపద ఉండే ది కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా పశు సంపద తగ్గిపోతుందని అన్నారు.ప్రస్తు తం మారుమూల ప్రాంతాల్లో సైతం పాల ప్యాకెట్ల పై ప్రజలు ఆదరపడుతున్నారని అ న్నారు...మన ప్రాంతంలో మంగళ్లపల్లి గ్రా మం రకరకాల పూల పెంపకానికి ప్రసిద్ధి చెం దిందని ఆలాగే ఎగ్లాస్ పూర్ గ్రామం కూడా పైలెట్ గ్రామంగా ఎంపిక చేసుకుని పాడి ప రిశ్రమ ను అభివృద్ధి చేసుకోవాలని అన్నా రు.

మీరు ముందుకు వస్తే ప్రతి ఇంటికి ఒక గేదెను రాష్ట్ర ప్రభుత్వం తరపున అందజేస్తామని తెలిపారు.ఇప్పుడు ఉన్న యూనిట్లకు అదనంగా మంజూరు అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు.పాడి పరిశ్రమ తో పాటు చేప ల,కోళ్ల పెంపుకం వైపు వెళ్లాలని అన్నారు. మన ప్రాంతంలో మిడ్ మానేరు,ఎగువ మా నేరు, మల్కాపేట రిజర్వాయర్ వీటితోపాటు ప్రతి గ్రామంలో చెరువులు కుంటలు మత్స్య సంపద పెంపొందడానికి తోడ్పడుతున్నాయని తెలిపారు.ప్రభుత్వం మత్స్యకారులకు ఉచిత చెప పిల్లలను పంపిణీ చేస్తుందన్నా రు.

పేద ప్రజల కోసం ఇందిరమ్మ ఇల్లు పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇ ల్లు మంజూరు చేస్తుందని అన్నారు. గ్రామంలోని తాళ్లపల్లి కవిత, మంగలి రిబ్కా ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వ విప్ పరిశీలించా రు.గతంలో ఇందిరమ్మ పేదలకు ఇళ్ళు ఇస్తే మల్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యంలో మళ్ళీ పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని తెలిపారు..

ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో మొ ట్టమొదటి ఇందిరమ్మ ఇల్లును కోలనూరు గోళ్ళపల్లి లో గృహ ప్రవేశం జరిగిందన్నా రు. పది సంవత్సరాలు ప్రజలు ఎదురు చూ సిన రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని,దేశంలో ఎక్కడ లేని విదంగా రాష్ట్రం లో సన్నం బియ్యం పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెటర్న రీ జిల్లా అధికారి రవీందర్ రెడ్డి, ఎస్సి కార్పొరేషన్ జిల్లా అధికారి స్వప్న,

ఏఎంసి చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, తాసిల్దార్ వరలక్ష్మి, ఎంపీడీవో శంకర్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్య క్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఏఎంసి డైరెక్టర్లు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండి ప్రభాకర్, జిల్లా నాయకులు, మండల నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.