23-08-2025 12:00:00 AM
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, ఆగస్టు 22 (విజయ క్రాంతి): పల్లెల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, చొప్పదండి నియోజకవర్గం లోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శుక్రవారం గంగాధర మండలం గర్శకుర్తిలో 20 లక్షలతో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భ వన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ జెండాను ఎగరవేశా రు.
ఉప్పరమల్యాలలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన పౌల్ట్రీ షెడ్డును ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పల్లెల అభివృద్ధి ల క్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం హాయంలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ అభివృద్ధి తిరిగి ప్రారంభమైందన్నారు.
శిథిలావస్థకు చేరుకున్న గ్రామపంచా యతీ కార్యాలయాల స్థానంలో, కొత్తగా ఏర్పడిన గ్రామాల్లో నూతన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. స్థానిక సంస్థల్లొ చొ ప్పదండి నియోజకవర్గం లోని 6 ఎంపీపీ, 6 జడ్పిటిసి స్థానాలతో పాటు ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యం గా నాయకులు, కార్యకర్తలు బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చై ర్మన్ వెలిచాల తిర్మల్ రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, దుబ్బాసి బుచ్చయ్య,రామిడి రాజిరెడ్డి,చిప్ప చక్రపాణి, రోమాల రమేష్, సత్తు కనుకయ్య, రాజేశం, బుర్గు గంగన్న, సాగి అజయ్ రావు, రాజగోపాల్ రెడ్డి,గునుకొండ బాబు,కర్ర బాపు రెడ్డి,పడితపల్లి కిష న్, వేముల అంజి,మ్యాక వినోద్, మంత్రి మ హేందర్, చందు, తదితరులుపాల్గొన్నారు.