calender_icon.png 20 August, 2025 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వట్టెం పంపు మోటార్ల డ్రై రన్ సక్సెస్.!

05-12-2024 12:58:47 PM

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ వద్ద నిర్మించిన వట్టెం పంపు మోటార్ల డ్రై రన్ గురువారం సక్సెస్ అయ్యింది. భారీ నీటిపారుదల శాఖ ప్రభుత్వ సలహాదారు పెంటరెడ్డి, సిఈ జి.విజయభాస్కర్ రెడ్డితో పాటు ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ పార్థసారథిల సమక్షంలో డ్రై రన్ నిర్వహించి మొదటి మోటరును సిద్ధం చేశారు. గత రెండు నెలల క్రితం భారీ వర్షాల నేపథ్యంలో శ్రీపురం ప్రాంతంలోని ఆడిటర్ టర్నల్ నుంచి వరద నీరు ప్రవేశించి వట్టెం పంప్ హౌస్ వరద పంపు మోటర్లు నీటిలో మునిగిన విషయం తెలిసిందే. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి వరద నీటిని తోడిపోసి మోటార్లను తిరిగి యధాస్థితికి తీసుకొచ్చేందుకు అధికారులు శ్రమించి డ్రైరెన్ పూర్తి చేశారు. మొదటి మోటర్ ని పూర్తిగా సిద్ధం చేయగా మిగతా వాటిని కూడా ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు.