24 April, 2026 | 1:27 AM

హైందవ ధర్మ విశిష్టతను తెలిపే వేదవ్యాస్

24-04-2026 12:03 AM

సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘వేదవ్యాస్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కే అచ్చిరెడ్డి సమర్పణలో నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాప రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ బ్యానర్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం జరిగింది. ‘సాయి ప్రగతి ఫిలిమ్స్’ అని నామకరణం చేసిన ఈ కొత్త బ్యానర్‌ను పూజా కార్యక్రమాలతో ఆవిష్కరించారు.

హైందవ ధర్మ విశిష్టతను ఆవిష్కరిస్తూ సైంటిఫిక్ అప్రోచ్ కలిగిన సకుటుంబ సమేత కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. పిడుగు విశ్వనాథ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా ద్వారా కొరియన్ నటి జూన్ హ్యూంజీ, మంగోలియన్ నటుడు షరన్ బోల్ సెగ్మెంట్‌ను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు.

ఇంకా ఈ చిత్రంలో సాయికుమార్, సుమన్, బాబుమోహన్, శివాజీరాజా, అలీ, ఉత్తేజ్, రఘుబాబు, అజయ్ ఘోష్ ముఖ్య తారాగణంగా ఉన్నారు. ఈ చిత్రానికి పాటలు: భువనచంద్ర, వెనిగళ్ల రాంబాబు; కెమెరా: శరత్; ఎడిటింగ్: చోటా కే ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్: బ్రహ్మ కడలి.