calender_icon.png 11 May, 2025 | 3:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలేశ్వరం ముక్తేశ్వరుడికి పూజలు చేసిన వేద పండితులు

09-05-2025 11:18:26 PM

మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రంలో భారత సైన్యానికి  మద్దతుగా ఆలయ ఉప ప్రధానార్చకులు పనింద్ర శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు పూజలు నిర్వహించారు. భారత్ పాకిస్తాన్ తో యుద్ధం చేస్తూ ఆపరేషన్ సిందూర్ తో ధైర్యముగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా, తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో  కమీషనర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ హైదరాబాద్  ఆదేశాల ప్రకారం  శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరం పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి మహేష్, స్థపతి శ్రీ వల్లినాయగం, ఎస్ ఈ శ్రీ దుర్గా ప్రసాద్, సూపరింటెండెంట్  శ్రీనివాస్, ఆలయ సిబ్బంది , గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.