10-05-2025 12:00:00 AM
కలెక్టర్ కుమార్ దీపక్
భీమారం (చెన్నూర్), మే 9 (విజయక్రాంతి) : భీమారం మండలంలో నూత నంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, త్వరితగతిన పూర్తి చేసి వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్ర వారం పీ హెచ్ సీ నిర్మాణ పనులను తహశిల్దార్ సదానందంతో కలిసి పర్యవేక్షించిన అనంతరం ఆయన మా ట్లాడారు.
ప్రజల సౌకర్యార్థం మం డల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేం ద్రం నిర్మించడం జరుగుతుందన్నారు. ప్రభు త్వం ప్రజల సంక్షేమం, వైద్య రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుం టుందన్నారు. అనంతరం మండల కేం ద్రంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు మద్దికల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతులకు రశీదు జారీ చేయా లని, రైతులు, ధాన్యం వివరాలను ట్యాబ్‌లలో నమో దు చేసి సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు.
రైతు ఆటోమెటిక్ యం త్రంతో శుభ్రం చేసి కొనుగోలు కేంద్రా ల వద్దకు నిబంధనల ప్రకారం ధాన్యం తీసుకురావాలని, అకాల వర్షా ల సమయంలో కేంద్రాలలో అందుబాటులో ఉన్న టార్పాలి న్లను వినియోగించుకోవాలన్నారు.