29-01-2026 01:47:42 PM
ఆగని నామినేషన్ల హోరు!
ఆశావహుల దూకుడు: బీఫామ్ రాకముందే నామినేషన్లు..
వేములవాడలో హీటెక్కిన రాజకీయం!
టికెట్ రాకుంటే ‘జంపింగ్’:
అధికార పార్టీకి రెబల్స్ దడ.. మరి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అడుగులెటు?
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): వేములవాడ ఆధ్యాత్మిక క్షేత్రమైన వేములవాడ మున్సిపల్ ఎన్నికల రాజకీయం(Vemulawada municipal election politics) మునుపెన్నడూ లేనంత ఆసక్తికరంగా మారింది. పట్టణంలోని 28 వార్డుల్లో పాగా వేయడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తుండగా ముఖ్యంగా అధికార పార్టీలో టికెట్ల లొల్లి తారస్థాయికి చేరింది. పార్టీ అధికారికంగా బీఫామ్‌లు జారీ చేయకముందే టికెట్ తమకే దక్కుతుందనే ధీమాతో ఆశావహులు నామినేషన్లు వేస్తుండడం ఇప్పుడు అధికార పార్టీలో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది.
వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అండదండలు ఎవరికి ఉన్నాయి అనే ఉత్కంఠ ఒకవైపు కొనసాగుతుండగా ప్రతి వార్డులోనూ ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలు కావడం పార్టీ శ్రేణుల్లో అయోమయాన్ని సృష్టిస్తోంది. తమకు టికెట్ రాదని సంకేతాలు అందిన కొందరు నేతలు ఇప్పటికే ఇతర పార్టీల వైపు చూస్తుండగా మరికొందరు రెబల్స్‌గా బరిలో నిలిచేందుకు.సిద్ధమవుతున్నారు
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే వరకు ఈ ఉత్కంఠ తప్పేలా లేదు. చివరి నిమిషంలో బీఫామ్ ఎవరిని వరిస్తుంది అసంతృప్త నేతలను నాయకత్వం ఎలా బుజ్జగిస్తుంది అనేది ఇప్పుడు పట్టణంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఆశావహులు పార్టీ మారి పోటీలో నిలిస్తే అది అధికార పార్టీ ఓటు బ్యాంకుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.