26-05-2025 01:16:49 AM
ఫౌండేషన్ వై.రఘునాథం ఎక్సలెన్స్ అవార్డు
కరీంనగర్, మే 25 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర విద్యారంగంలో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నందుకుఅల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, విఎన్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.వి. నరేందర్ రెడ్డికి వెంకట్ ఫౌండేషన్ వై రఘునాథం ఎక్స్లెన్స్ అవార్డును ప్రధానం చేసింది.
నగర శివారులోని ప్రైవేటు వేడుక మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ, వెంకట్ ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ గంప వెంకట్ చేతులమీదుగా అవార్డును ప్రధానం చేశారు. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ అవార్డు బాధ్యత మరింత రెట్టింపు చేసిందన్నారు.
అవార్డు రావడానికి కృషి చేస్తున్న సిబ్బందికి, ప్రోత్సాహాన్ని అందిస్తున్న తల్లిదండ్రులకు అంకితమిస్తున్నానని, సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.