calender_icon.png 26 May, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామగుండం అభివృద్ధిపై సింగరేణి

26-05-2025 01:15:23 AM

అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

రామగుండం, మే 25 (విజయక్రాంతి): రామగుండం అభివృద్ధి పై సింగరేణి సంస్థ అధికారులతో ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ అభివృద్ధి విషయంలో ఇల్లందు గెస్ట్ హౌస్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆదివారం సింగరేణి సంస్థ జీఎం లలిత్ కుమార్ తో పాటు వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.

ప్రధానంగా గోదావరిఖని పట్టణ చౌరస్తాలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు, ఇంటర్నల్ రోడ్లు, తాగునీటి కోసం రాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ వాటర్ నిర్మాణ పనులు, జనగామ, బస్టాండ్ తదితర ప్రాంతాలలో రోడ్లు, లైటింగ్స్ విషయమై అధికారులతో ప్రస్తావించారు.

అంతేకాకుండా మురుగు నీటిని శుభ్రం చేసే ఎస్టిపి ల నిర్మాణం విషయంలో పురోగతిపై చర్చించారు.గ్రామాల అభివృద్ధి, ప్రధాన రోడ్ల నిర్మాణపు పనుల గురించి ప్రస్తావించారు.అదేవిధంగా ముస్లింలకు సంబంధించిన కబ్రిస్తాన్ నిర్మాణ పనుల గురించి చర్చించారు. ఆయన వెంట వివిధ శాఖల అధికారులు, నాయకులుఉన్నారు