31 March, 2026 | 1:57 AM

భక్తిశ్రద్ధల మధ్య వేంకటేశ్వర కల్యాణం

31-03-2026 12:21 AM

భక్తులతో కలిసి పాల్గొన్న అంజయ్య యాదవ్ 

షాద్ నగర్, మార్చి 30 (విజయక్రాంతి): జానంపేట శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాన్ని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ భక్తులతో కలిసి భక్తి భావంతో తిలకించారు. మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతూ, వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణోత్సవం ఘనంగా జరిగింది.

కార్యక్రమానికి హాజరైన అంజయ్య యాదవ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి కూర్చొని కల్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ, స్వామివారి దివ్య కృప ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. ప్రాంత ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతి సమృద్ధులతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, ఐక్యతను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. భక్తి, నమ్మకం మన జీవన విధానాన్ని మరింత బలపరుస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు, మాజీ మార్కెట్ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, కౌన్సిలర్లు పిల్లి శారద శేఖర్, గోపాల్, ఎస్పీ శివ మాజీ కౌన్సిలర్లు వెంకట్రాం రెడ్డి, కానుగు అనంతయ్య, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.