calender_icon.png 31 January, 2026 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నుల పండువగా వేంకటేశ్వర కల్యాణం

31-01-2026 12:00:00 AM

గరిడేపల్లి, జనవరి 30 : మండల కేంద్రంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం లో భక్తులు శుక్రవారం కన్నుల పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా వేకువజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఎదుర్కోళ్ళు కార్యక్రమాన్ని మహిళా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు మధ్య అర్చకులు వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని శాస్త్రృక్తంగా నిర్వహించారు.

సాయంత్రం కళ్యాణ వెంకటేశ్వర స్వామిని పురవీధుల గుండా మేళతాళాలతో ఊరేగించారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పెండెం శ్రీనివాస్ గౌడ్,మాజీ సింగిల్ విండో చైర్మన్ బండ నర్సిరెడ్డి,మాజీ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్,ఆలయ అర్చకులు సుదర్శన శ్రీనివాసచార్యులు,సుదర్శన ఫణి ఆచార్యులు,సుదర్శన రాజన్ ఆచార్యులు,గ్రామ పెద్దలు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.