31-01-2026 12:00:00 AM
వాసవీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహణ
ఖైరతాబాద్, జనవరి 30(విజయక్రాంతి): మహాత్మా గాంధీ వర్థంతిని పురస్కరించుకొనిశుక్రవారం వాసవి హాస్పిటల్, ఖైరతాబాద్ వారి సౌజన్యంతో లక్డికాపూల్ లోని ఐఐఎంసీ కళాశాలలోని చల్లా సోమ్ రాజ్ రామ్ సమావేశ మందిరంలో ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని కళాశాల ప్రిన్సి పాల్, ఎన్‌ఎస్‌ఎస్ చైర్మన్ కూర రఘువీర్ మాట్లాడుతూ నేటి పిల్లలు జంక్ ఫుడ్‌ను తింటూ తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని అన్నారు.
మంచి ఆహారాన్ని తీసు కుంటూ, మంచి అలవాట్లను పాటిస్తే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చని.. ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలిపారు. వాసవి హాస్పిటల్ చైర్మన్ జయప్రకాశ్, కార్యదర్శి మల్లికార్జున్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరో గ్యం బాగుంటేనే బాగా చదువుకుని మంచి స్థాయికి ఎదుగుతారని అందుకే మా హాస్పిటల్ తరఫున విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్ష లు నిర్వహించామన్నారు. మహాత్మా గాంధీ వర్థంతిని పురస్కరించుకొని రెండు నిమిషాల పాటు అందరూ మౌనం పాటించారు.
తదనంతరం గైనకాలజిస్ట్ డాక్టర్ రమ్య, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ భానుప్రియ, అసిస్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ కరి ష్మా, ఆప్తమాలజీ డాక్టర్ సునీల్, నితిన్, ఈఎన్‌టీ డాక్టర్ గీతాంజలి, డెంటల్ డాక్టర్ శ్రీనివాస్,హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ విజయ్ ఆధ్వర్యంలో దాదాపు 400 మంది విద్యార్థులకు, అధ్యాపకులకు వైద్య పరీక్షలు నిర్వహించి సూచనలు, సలహాలు అందజేశారు.
ల్యాబ్ టెక్నీషియన్ రమ ణ ఆధ్వర్యంలో బ్లడ్ గ్రూపింగ్ టెస్ట్ చేశారు. కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ యూనిట్ 1,2 ప్రోగ్రాం ఆఫీసర్లు ఇ.రామకృష్ణ, ఎం.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఐఐఎంసీ కళాశాల, జాతీయ సేవా పథక(ఎన్‌ఎస్‌ఎస్) వలంటీర్లు 15 మంది పాల్గొన్నారు. కళాశాల డీన్లు డాక్టర్ తిరుమలరావు, డాక్టర్ సంతోషి, అధ్యాపకులు విజయానంద్, విజయ్, కిషన్ గౌడ్, శ్యామ్, క్యాస ప్రవీణ్, ఇతర అధ్యాపకులు వారి సహకారాన్ని అందజేశారు.