మల్లు రవికి మద్దతుగా వెన్నెల ప్రచారం
09-05-2024 12:41 AM
రంగారెడ్డి, మే 8 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి కి మద్దతుగా బుధవారం గద్దర్ కూతు రు వెన్నెల ఆమనగల్లు మండలంలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా సంక్షేమ పాలన అని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఆరు గ్యారెంటీలు అందుతాయని చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కేవలం ప్రజలను దోచుకొనేందుకే మరోసారి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. కేంద్రంలో, రాష్ట్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. మల్లు రవిని గెలిపించుకొంటే అన్ని వర్గాలకు ఆయన అందుబాటులో ఉంటూ సేవచేస్తారని పేర్కొన్నారు.




