ఐదు గ్యారెంటీలను అమలుచేశాం
09-05-2024 12:43 AM
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి
ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్, మే 8: కాంగ్రెస్ గెలుపుతోనే ఖేడ్ అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి పేర్కొన్నా రు. బుధవారం సిర్గాపూర్ మండలం వాసర్‌లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో మాట్లాడారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో తమ పార్టీ అభ్యర్థి సురేశ్‌షెట్కార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేసిందని చెప్పారు. ఆగస్టు 15 వరకు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసెంబ్లీ ఇన్‌చార్జ్ శశికళయాదవరెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రాకేశ్ షెట్కార్ పాల్గొన్నారు.




