22-07-2025 12:43:30 AM
హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిం చింది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొ త్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్ది పేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుం చి అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చే సింది.
ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరా బాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూ బ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉ రుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. బుధవారం మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అతిభారీ వర్షాలు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామా బాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్, కామా రెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షా లు కురుస్తాయని తెలిపింది.