calender_icon.png 22 July, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియాపై ఆందోళన వద్దు

22-07-2025 01:11:28 AM

రాష్ట్రంలో తగినంత అందుబాటులో ఉంది

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తత అవసరం

వర్షపు నీటిని జాగ్రత్తగా ఒడిసిపట్టుకోవాలి

  1. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
  2. జిల్లా కలెక్టర్లతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాం తి): రాష్ట్రంలో కావాల్సినంత యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. సెక్రటేరియేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఏర్పాటు చేసిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష జరిపారు.

ఈ సం దర్భంగా  యూరియా కృత్రిమ కొరత ప్రచారానికి కలెక్టర్లు అడ్డుకట్ట వేయాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఆగస్టు కోటా కూ డా త్వరలోనే రాష్ట్రానికి సరఫరా అవుతుందన్నారు. యూరియా స్టాక్ వివరాలను డీలర్లు, షాప్‌ల వద్ద బోర్డుపై డిస్‌ప్లే చేయాలన్నారు. స్టాక్ వివరాలు ఆన్‌లైన్‌లో ఉండే లా చర్యలు తీసుకోవాలన్నారు.

యూరి యా అమ్మకాలు సాఫీగా సాగేలా రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల డీలర్లు, షాపుల వద్ద ఇద్దరు అధికారులు, ఇద్దరు పోలీసులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇతర వ్యాపార అవసరాలకు యూరియాను మళ్లిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

ఇటీవలే కేంద్ర మంత్రి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారని, వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు యూరియాను మళ్లిస్తే కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని, కేసులు పెట్టాలని ఆదేశించారు. ఎరువులకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని, రైతులు, పేద ప్రజల కంటే తమ ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు.

25 నుంచి రేషన్ కార్డుల పంపిణీ

రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ర్టం లో 96 లక్షల కార్డులతో 3.10 కోట్ల మంది సన్న బియ్యం తీసుకుంటున్నారని తెలిపారు.  సన్న బియ్యం పంపిణీతో గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్‌కార్డులు, రేషన్ షాపుల విలువ పెరిగిందని తెలిపారు. రాష్ర్టంలో దా దాపు 7 లక్షల కొత్త కార్డుల పంపిణీకి ప్రభు త్వం శ్రీకారం చుట్టిందన్నారు.

దీంతో దాదా పు 31 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయని తెలిపారు. రేషన్‌కార్డుల పంపిణీని రా ష్ర్టమంతటా ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఆగస్ట్ 10వ తేదీ వరకు అన్ని మండలకేంద్రాల్లో అధికారికంగా రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్ర మం చేపట్టాలని సూచించారు. జిల్లా ఇన్‌ఛా ర్జీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధు లు కొత్త కార్డుల పంపిణీలో పాల్గొనాలన్నా రు.

ప్రతీ మండలంలో నిర్వహించే కార్యక్రమంలో కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొ నాలన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి నియోజక వర్గంలో కనీసం ఒకచోట జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. అందుకు వీలుగా షెడ్యూలును కలెక్టర్లు తయారు చేసి రేషన్ కార్డుల పంపిణీ విజయవంతంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. 

కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి

జూలై, ఆగస్ట్ నెలల్లో వర్షాలు కురువను న్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, రైతులు, ప్రజలకు ఎలాంటి ఇ బ్బంది లేకుండా  ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.  ఒక్కోరోజు ఒక్కోచోట అంచనాలకు మించి న భారీ వర్షం కురుస్తున్నదని, అందుకే వ ర్షాలు కురిసే ఈ రెండు నెలల సీజన్లో  అన్ని విభాగాల అధికారులు జిల్లాల్లో అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అందించే వర్ష సూచనలను వెంటనే అన్ని గ్రామాలకు చేరవేసేలా కలెక్టర్లు బాధ్యత వహించాలని, దీంతో కనీసం మూడు గంటల ముందే రైతు లు, ప్రజలను అప్రమత్తం చేసే వీలుంటుందన్నారు. జూన్ నుంచి ఇప్పటి వరకు రా ష్ర్టంలో 21 శాతం వర్షపాతం తక్కువగా న మోదైందని, గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు.

వర్షాల కారణంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ట్రాఫిక్ ఇ బ్బందులు, నీరు నిల్వ ఉన్నచోట్ల ప్రమాదా లు జరుగుతున్నాయన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అన్ని విభాగాలు మరిం త సమర్థంగా పనిచేయాలన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కునేలా జీహెచ్‌ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్ విభాగాలు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, హైడ్రా ఆ ధ్వర్యంలోని 150 బృందాలు వెంటనే రంగంలోకి దిగాలన్నారు.

సిబ్బందితో పాటు అధి కారులు నేరుగా క్షేత్రస్థాయిలో అందుబాటు లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. హైదరాబాద్ పరి ధిలో పోలీస్ కమిషనర్లతో పాటు అన్ని విభాగాల ఉన్నతా ధికారులు, అన్ని విభాగాలు స మన్వయంతో పనిచేసేలా జిల్లా కలెక్టర్లు బా ధ్యతగా వ్యవహరించాలన్నారు.  వాతావరణ సూచనలకు అనుగుణంగా కమాండ్ కంట్రో ల్ రూం నుంచి సమన్వ యం చేసుకోవాల ని ఆదేశించారు. 

వర్షాల కారణంగా ఎలాం టి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాల న్నారు. కొన్నిచోట్ల పిడుగుపాటుతో చనిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని,ఆ వివరాలను కూడా నమోదు చేస్తే  వారికి ప్రభుత్వ సా యం అందించే వీలుంటుందన్నారు. 

వర్షపు నీటిని వృథాగా పోనియొద్దు

జిల్లాల పరిధిలో సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీటిని జాగ్రత్తగా ఒడిసిపట్టుకోవాలని, నీటి నిల్వలను  అంచనా వేసుకొని నీటి వినియోగ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. వర్షపు నీటిని వృథాగా పోనివ్వవద్దన్నారు. చెరువులు, కుంటలకు, కాల్వలకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కృష్ణా బేసిన్ పరిధిలో ఇప్పటికే కొన్ని  ప్రాజెక్టుల కింద నీటి విడుదల మొదలైందన్నారు. త్వరలోనే నాగార్జునసాగర్ నీటిని విడుదల చేస్తామని తెలిపారు.

సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కు మార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కో మటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివే క్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్తగూడెం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఖమ్మం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సీజన్ వ్యాధులపై అప్రమత్తత

వర్షాల సీజన్‌లో డెంగీతో పా టు సీజనల్ జ్వరాలు, అంటువ్యాధు లు ప్రబలకుండా వైద్య,ఆరోగ్య శాఖ సన్నద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేం దుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.  ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యు లు ఎప్పుడూ అందుబాటులో ఉం డాలన్నారు. పశువులకు సంబంధిం చి వెటర్నరీ విభాగం అప్రమత్తంగా ఉండాలన్నారు.

ప్రజలకు ఆపద వస్తే కలెక్టర్లు వెంటనే స్పందించాలన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్ ఖాతాలో రూ. కోటి అత్యవసర నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేస్తుందని పేర్కొన్నారు. కలెక్టర్లు ప్రతి రోజు ఉదయం క్షేత్రస్థాయి పర్యటన చేపట్టాలని,  కలెక్టర్ల కార్యాచరణకు సంబంధించి సీఎస్ ప్రభుత్వానికి రిపోర్టు అందించాలన్నారు.