18 August, 2026 | 9:42 PM

నకిలీ విత్తనాలపై అప్రమత్తత అవసరం

24-05-2024 12:32 AM

ఇల్లెందు డీఎస్పీ చంద్రబాబు

ఇల్లెందు మే 23: రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇల్లెందు డీఎ స్పీ చంద్రబాబు సూచించారు. గురువారం ఇల్లెందు మండలంలోని కొమరారంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లైసెన్సు ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. అధిక దిగుబడులు వస్తాయని, చీడపీడలు రావని, తక్కువ ధరకే విత్తనాలు విక్రయిస్తున్నామని మోసం చేసే వ్యక్తుల పట్ల  జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. నాసిరకం విత్తనాలు అమ్మితే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గుండాల సీఐ రవీందర్, కొమరారం ఎస్సై సోమేశ్వర్ పాల్గొన్నారు.