ఎంజీఎం దవాఖాన సందర్శన
24-05-2024 12:05 AM
వరంగల్ తూర్పు, మే 23: సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానను గురువారం ఎమ్మె ల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సందర్శించారు. దవాఖానలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన విషయంపై ఇన్‌చార్జి సూప రింటెండెంట్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డిని ఆరా తీశారు. ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని ఎమ్మెల్యే వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యసేవలు అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట ఆర్‌ఎంవోలు డాక్టర్ మురళి, డాక్టర్ ప్రసాద్ ఉన్నారు.






