17-01-2026 03:25:41 AM
బూర్గంపాడు,జనవరి16,(విజయక్రాంతి):ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రజలకు,అధికారులకు వారధిగా విజయక్రాంతి పనిచేస్తుందని ఎంపీడీవో జమలారెడ్డి అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో విజయక్రాంతి దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆయన ఆవిష్కరించారు.అదేవిధంగా బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐ మేడా ప్రసాద్ విజయక్రాంతి దినపత్రిక క్యాలెండర్ను ఆవిష్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిష్పక్షపాతంగా వార్తలు సేకరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని కొనియాడారు. పత్రికలు సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్‌ఐ దేవ్ సింగ్, సూపర్డెంట్ రవీంద్రబాబు,సీనియర్ పాత్రికేయులు బిజ్జం వెంకటరామిరెడ్డి, శ్రీనివాసచారి, సురేష్,విజయక్రాంతి రిపోర్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.