17-01-2026 03:24:08 AM
కారేపల్లి,విజయక్రాంతి : సింగరేణి మండలం భాగ్యనగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోగల సామ్య తండా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణమునందు దేవస్థాన ఆలయ చైర్మన్ ధరావత్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాగ్యనగర్ తండా గ్రామ సర్పంచ్ భానోత్ హీరాలాల్, రెండో వార్డు సభ్యులు లకావత్ సుమ అప్పారావు, మూడో వార్డు సభ్యులు పద్మ వెంకన్న గార్ల సహకారంతో ఘనంగా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముగ్గుల పోటీ విజేతలను ప్రకటించడానికి ముఖ్య అతిథులుగా కారేపల్లి మండల మీడియా మిత్రులు వచ్చి విజేతలను ప్రకటించారు. అనంతరం గ్రామస్తులు సంక్రాంతి పండుగ సందర్భంగా తాడు లాగుట ఆటలో ఉత్సాహంగా పాల్గొంటూ సంక్రాంతి సంబరాలను గ్రామాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సంస్కృతి సంప్రదాయాలను ఇలాగే కొనసాగించాలని గ్రామస్తులు ఇదే తరహాలో పాల్గొంటూ ఏ పండగ వచ్చిన ఇలాగే జరుపుకోవాలని తెలిపారు.
అలాగే ముగ్గుల పోటీ విజేతలుగా నిలిచినటువంటి వారిని ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను గౌరవ ముఖ్య అతిథులుగా వచ్చిన వారు అందించారు అలాగే పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మూడో వార్డు సభ్యురాలు గుగులోత్ పద్మ వెంకన్న సహకారంతో బహుమతులను అందజేశారు.అనంతరం స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన ఉప సర్పంచ్ వార్డు మెంబర్లతో పాటు అలయ చైర్మన్ , గ్రామ పెద్దలను శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ గుగులోత్ బిక్కులాల్, జర్నలిస్టులు కొండపల్లి వెంకటేశ్వర్లు, ఏపూరి లక్ష్మీనారాయణ, కొత్తూరీ శ్రీనివాసరావు, కమిటీ గౌరవాధ్యక్షులు భూక్య సక్రియ, గ్రామ పెద్దలు బానోత్ రాందాస్, కమిటీ సభ్యులు గుగులోత్ రమేష్, నూనావత్ నాగేష్, బానోతు సుమ, గ్రామ మహిళలు పెద్దలు యువతీ యువకులు పాల్గొన్నారు.