16-10-2025 06:17:53 PM
చిగురుమామిడి (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ప్రజా పరిషత్ అధికారి (ఎంపీడీవో) గా తూపట్ల విజయ్ కుమార్ గురువారం మండల పరిషత్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తిమ్మాపూర్ నుండి డిప్యూటేషన్ గా జమ్మికుంటలో విధులు నిర్వహిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చిగురు మామిడికి వచ్చారు. విజయ్ కుమార్ ఇంతకుముందు పెద్దపెల్లి జిల్లా కమాన్ పూర్, రామగిరి మండలాల్లో ఎంపీడీవోగా విధులు నిర్వహించారు.
ఎంపీవోగా కిరణ్ కుమార్..
ఎంపీఓగా బత్తిని కిరణ్ కుమార్ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం బాధ్యత స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన బండ రాజశేఖర్ రెడ్డి డిప్యూటేషన్ పై హుజురాబాద్ కు బదిలీపై వెళ్లారు. కాగా హుజురాబాద్ నుండి కిరణ్ కుమార్ చిగురుమామిడికి బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో ఎంపీవోలను మండల పంచాయతీ కార్యదర్శులు శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.