07-10-2025 12:00:00 AM
సిద్దిపేట, అక్టోబర్ 6 (విజయక్రాంతి): ఇ టీవల జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ బదిలీపై హైదరాబాదులోని ఎల్బీనగర్ డిసిపిగా వెళ్లారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ గా యస్.యం.విజయ్ కు మార్ బదిలీపై వచ్చారు. సోమవారం ఆయ న పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ సిహెచ్ కుశాల్కర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, గజ్వేల్ ఎసిపి నరసింహులు, హు స్నాబాద్ ఏసీపి సదానందం, టాస్క్ ఫోర్స్ ఏసిపి రవీందర్, ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్, పోలీస్ అధికారులు పోలీస్ కార్యాలయ సిబ్బంది అధికారులు.
మర్యాదపూ ర్వకంగా పోలీస్ కమిషనర్ ను కలసి స్వా గతం పలికారు.బదిలీపై వెళ్లిన ఐపీఎస్ అధికారి డాక్టర్ అనురాధను సిద్దిపేట పోలీస్ అ ధికారులు ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఘనంగా సన్మానించారు.