07-10-2025 12:00:00 AM
హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో నేటి నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలి పింది. మంగళవారం పలు జిల్లాలలో ఒక మోస్తారు వర్షాలు కురు స్తాయని పేర్కొంది. ఈమేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 కి.మీ. వేగంతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు, రేపు, గురువారం, శుక్రవారం, శనివారం వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.