‘విజయ సంకల్ప యాత్ర’ షురూ
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు పీసీసీ దివ్యాంగుల విభాగంతోపాటు రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ఆధ్వర్యంలో ‘విజయసంకల్ప యాత్ర’ ప్రారంభమైంది. ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్ బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చత్తీస్‌గఢ్‌లో అమలు చేస్తున్న విధంగా దివ్యాంగులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. వారి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో పెరిక కార్పొరేషన్ సాధన సమితి అధ్యక్షులు కోట మల్లికార్జున్, నాయకులు వెంకటేశ్వర్లు, వీరభాస్కర్, శంకర్, చైతన్యరాజు పాల్గొన్నారు.






