17-01-2026 07:17:55 PM
మునిపల్లి,(విజయక్రాంతి): మండలంలోని మొగ్దుంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ సరళ దయానంద్ ఆధ్వర్యంలో శనివారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందదర్భంగా గ్రామ సర్పంచ్ సరళ దయానంద్ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు గ్రామ సభ నిర్వహించడం జరిగిందన్నారు. అందుకు పాలకవర్గంతోపాటు గ్రామస్తులంతా సహకరిస్తే గ్రామాన్ని అభివృద్ది మరింత జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రామలక్ష్మి, గ్రామ పెద్దలు బస్వరాజ్, ప్రవీణ్, సంగమేశ్వర్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జంషీద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.