17-01-2026 07:20:18 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ పరిధిలోని దేవేంద్ర గుట్టపై కొలువైన దేవేంద్రుడు మాఘ అమావాస్య జాతరకు ముస్తాబయ్యారు. ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య సందర్భంగా ఇక్కడ నిర్వహించే జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ జాతరను పురస్కరించుకుని పెద్దమల్లారెడ్డి గ్రామ సర్పంచ్ కోడూరి సాయగౌడ్ మరియు ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో దేవేంద్ర గుట్ట పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి, ప్రత్యేక పూజలు, అలంకరణలు చేపట్టారు. భక్తులు దేవేంద్రుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేశారు. జాతరను శాంతియుతంగా, ఘనంగా నిర్వహించేందుకు స్థానిక ప్రజలు, ఆలయ నిర్వాహకులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.