30-12-2025 07:37:14 PM
మోతే,(విజయక్రాంతి): గ్రామని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తుమ్మ గూడెం గ్రామ సర్పంచ్ కుక్క ధనమ్మ భిక్షం అన్నారు. గ్రామంలో వీధి దీపాలు, వేయడం మురుగు కాల్వలు నిర్మించడం, ట్రాగునీటి సమస్య లేకుండా చేయడంతో అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం పెన్షన్లు రాని వృద్దులకు వికలాంగులకు వితంతువులకు సహాయం చేయడం గ్రామానికి ఖమ్మం నుంచి తుమ్మ గూడెం వరకు ఆర్టిసి బస్సును రప్పించే విధంగా రహదారి నిర్మాణానికి కృషి చేయనున్నట్లు తెలిపారు.