calender_icon.png 31 December, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రాన్ని, ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ

30-12-2025 09:50:31 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రాన్ని, ఫర్టిలైజర్ దుకాణాలను ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థ సింహారెడ్డి మంగళవారం పరిశీలించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో పార్థ సింహారెడ్డి ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో గర్భిణీ స్త్రీల వివరాలను, సిబ్బంది హాజరు పట్టిక వివరాలను మందుల స్టాక్ వివరాలను స్థానిక ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి సుజన్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమయాన్నిసారాని పాటించాలని, రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సరిపడా మందులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

అలాగే ఫర్టిలైజర్ దుకాణాలను పరిశీలించి రానున్న యాసంగి పంటలకు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచుకోవాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలను అందజేయాలని స్టాక్ వివరాలను మెయింటైన్ చేయాలని, రైతులకు విత్తనాలను విక్రయిటప్పుడు రసీదు కంపల్సరీ ఇవ్వాలన్నారు. రైతులకు కంపెనీ విత్తనాలే అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి సృజన్ కుమార్, ఏవో సాయికిరణ్, సిబ్బంది, ఫర్టిలైజర్ దుకాణా దారులు తదితరులు ఉన్నారు.