30-12-2025 09:39:56 PM
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ
కోదాడ: విద్యార్థులు పట్టుదలతో చదివి ర్యాంకులు సాధించి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వీ.లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని ఆర్ఎస్వీ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఎన్ఆర్ఎస్ఐఐటీ & మెడికల్ అకాడమీ 3వ వార్షికోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ వంటి పట్టణ ప్రాంతాలలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందించి, వారిని జాతీయ స్థాయి ర్యాంకర్లుగా తయారుచేస్తున్న ఎన్ఆర్ఎస్ అకాడమీ కృషి అభినందనీయమన్నారు.
అకాడమీ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి మాట్లాడుతూ తమ సంస్థ ఆవిర్భావం, దానికి గల కారణాలు, సంస్థ లక్ష్యాల గురించి వివరించారు. తమ లక్ష్యాలు సాధించేందుకు తమకు సహకరిస్తున్న విద్యార్థులకు,వారి తల్లిదండ్రులకు, లెక్చరర్లకు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అకాడమీ అడ్వైజరీ చైర్మన్ రవిశంకర్ రెడ్డి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, అకాడమీ కరస్పాండెంట్ వేణుగోపాల్ రావు,అకడమిక్ అడ్వైజర్ మైనం రామయ్య, ప్రిన్సిపాల్ గంధం వెంకటరమణ (జీ వీ), వైస్ ప్రిన్సిపాల్ పీ . నాగేశ్వర రావు(పీ ఎన్ ఆర్), ఏ వో లు మౌనిక, పీ ఆర్ వో మల్లికార్జున్ పాల్గొన్నారు.