30-12-2025 09:57:18 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): నగునూరు గ్రామంలో రైతుల రవాణా, రాకపోకల అవసరాల కోసం రోడ్డును నిర్మించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కు స్థానిక రైతులందరూ కలసి వినతి పత్రం సమర్పిస్తే, ఈజీఎస్ ద్వారా రోడ్డు నిర్మాణం చేయించారని, రైతులకు ఉపయోగపడే రహదారి విషయంలో కాంగ్రెస్ నేత కొలగని అనిల్ తప్పుడు ఫిర్యాదు చేసి, దుష్ప్రచారం చేయడం సరికాదని, అనిల్ చేసిన అసత్య ఫిర్యాదును వెంటనే వెనక్కి తీసుకోవాలని నగునూరు రైతులు డిమాండ్ చేశారు. అనిల్ ప్రజావాణిలో తప్పుడు ఫిర్యాదు చేశారని, జిల్లా రెవెన్యూ అధికారికి మంగళవారం లిఖితపూర్వకంగా వినతి పత్రం సమర్పించారు.