30-12-2025 09:44:24 PM
భీమారం,(విజయక్రాంతి): ఆరుతడి పంటలు సాగు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని మండల వ్యవసాయాధికారి అత్తె సుధాకర్ సూచించారు. మంగళవారం భీమారం రైతు వేదికలో రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో రైతులనుద్దేశించి ఏఓ మాట్లాడారు. యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చన్నారు. యాసంగిలో మొక్కజొన్న, జొన్న,పెసర, మినుము, నువ్వులు, పొద్దు తిరుగుడు పంటలకు అనుకూలమని, నీటి సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా సాగు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి అరుణ్ కుమార్, రైతులు పాల్గొన్నారు.