08-09-2025 08:11:24 AM
బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని రవీందర్.
బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో భారీ చేరికలు
తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా(Suryapet District) తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుండి దాదాపు 100 మంది పైగా యువకులు బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని రవీందర్ రావు(BJP state leaders Sankineni Ravinder Rao) ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పథకాలకు గ్రామాల్లో నాయకులు ఆకర్షితులై పార్టీలో చేరమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాల పేద ప్రజలకు వరం లాగా మారిందని అన్నారు. రాష్ట్ర, దేశ ప్రజల సుఖసంతోషాలతో ఉండాలంటే బీజేపీ ప్రభుత్వమే మార్గమని అన్నారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా, మండల పార్టీ అధ్యక్షులు నారాయణదాసు నాగరాజు, జిల్లా నాయకులు గాజుల మహేందర్, పూసపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ యువకులు పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బోనగిరి రాజు, వెలుగు సోమయ్య,వెలుగు నరసయ్య, వగలగాని నగేష్,వెలుగు శ్రీకాంత్, వెలుగు మధుసూదన్, వెలుగు లోకేష్, మోర రాజశేఖర్, కుక్కల వీరేష్, కుక్కల నాగరాజు, వెలుగు మురళి,శాగంటి వినోద్,శాగంటి చంటి, వెలుగు మధు, వెలుగు వెంకన్న, వెలుగు భీమయ్య, వగలగాని వెంకన్న, దిలీప్ పలువురు బిజెపి పార్టీలో చేరారు.