08-09-2025 08:23:47 AM
హైదరాబాద్: సోమవారం ఉదయం 11 గంటలకు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్(TPCC President Mahesh Kumar) అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్(AICC incharge Meenakshi Natarajan) పాల్గొననున్నారు. మీనాక్షి నటరాజన్ తో పాటు పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు పీసీసీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జిలు ఈ భేటీలో పాల్గొననున్నారు. పార్టీ బలోపేతం, ఓట్ల చోరీపై నిరసనలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ నిర్వహించనున్నారు. అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు తదితర అంశాలపై చర్చ కొనసాగనుంది.