13-12-2024 03:51:52 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కిష్టారం గ్రామానికి చెందిన కంగల లక్ష్మణ్(38) గురువారం రాత్రి ఇల్లందు నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. మార్గం మధ్యలో తొమ్మిదోమైలు తండా సమీపంలోని మూలమలుపు వద్ద బైక్ అదుపు తప్పి దిమ్మెకు ఢీకొట్టింది. పక్కనే ఉన్న పొదల్లో పడి తలకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. రాత్రి కావడంతో స్థానికులు ఎవరు గమనించలేదు. శుక్రవారం ఉదయం స్థానికులు సమాచారంతో టేకులన ఎస్ఐ పోగుల సురేష్, సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేశహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.