24-10-2025 01:14:20 AM
కొత్తపల్లి, అక్టోబర్ 23(విజయక్రాంతి):రైతు స్థాయిలో విత్తనోత్పత్తిని ప్రోత్సహించలని సదుద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులకు, పరిశోధనా కేంద్రాల్లో అభివృద్ధి చేసిన నాణ్యమైన విత్తనాన్ని గ్రామగ్రామాన నాణ్యమైన విత్తనం (క్వాలిటీ సీడ్ ఇన్ ఏవేరీ విలేజ్ -క్యూ ఎస్ ఈ వి) అనే కార్యక్రమo ద్వారా సరఫరా చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా, గురువారం రోజున కొత్తపల్లి మండలం లోని, కొత్తపల్లి పట్టణం మరియు కమాన్ పూర్ గ్రామల్లో క్యూ ఎస్ ఈ వి - వరి (జె జి ఎల్ - 24423) రకం వేసిన పొలంలో క్షేత్ర దినోత్సవం నిర్వహించ డం జరిగింది. ఈ సందర్భంగా జె జి ఎల్ -24423 రకం వేసిన రైతులు విత్తనోత్పత్తి గురించి వా రు తీసుకున్న జాగ్రత్తలను తెలిపారు.
తదుపరి వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ ప్రధాన శాస్త్రవేత్త డా.బి. రాంప్రసాద్ మాట్లాడుతూ రైతు స్థాయిలో లో విత్తనోత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలు మరియు వరిలో పురుగుల మరియు తెగుళ్ళ యాజమాన్యం గురించి వివరించారు.
తరువాత శాస్త్రవేత్తలు డా. జి. ఉషారాణి మరియు ఇ. ఉమారాణి మాట్లాడుతూ విత్తనోత్పత్తి క్షేత్రాల్లో బెరుకుల తీసివేత గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండల వ్యవసాయధికారి కోట సంతోష్ కుమార్, ఎఈఓలు రాము, రాజేంద్రప్రసాద్, రైతులు రాములు, దుర్గాప్రసాద్, గిర్ర శ్రీనివాస్ మరియు శంకరయ్యపాల్గొన్నారు.