calender_icon.png 24 October, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2620 మద్యం షాపులకు 95285 దరఖాస్తులు

24-10-2025 01:13:03 AM

-ఫీజుతో రూ.2858 కోట్ల ఆదాయం

-ముగిసిన గడువు

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి) : తెలంగాణలోని మద్యం దుకాణాల టెం డర్‌కు  భారీగానే దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం షాపులుండగా గురువారం గడువు ము గిసే నాటికి 95,285 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దర ఖాస్తుకు రూ. 3 లక్షల ఫీజును ప్రభుత్వం నిర్ణయించిన విష యం తెలిసిందే. దీంతో ప్రభుత్వానికి దరఖాస్తులతోనే  రూ. 2,858.55 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రభుత్వం దరఖాస్తుల ద్వారానే రూ. 3 వేల కోట్ల ఆదాయం వస్తుందని అబ్కారీ శాఖ అంచనా వేసిం ది.

2023 నాటికి 1.32 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అప్పుడు ఒక్కో దరఖాస్తు రూ. 2 లక్షల ఫీజు నిర్ణయించగా, మొత్తం దరఖాస్తులకు గాను రూ. 2,640 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే మద్యం దరకాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 18 వరకే ఉండగా, అదే రోజు బీసీ బంద్, ఆ తర్వాత దిపావళీ పండుగ ఉండటంతో దర ఖాస్తులకు గడువును పెంచా రు. అప్పుడు 90 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పు డు గడువు పెంచాక అదనంగా 5 వేలకు పైగా దరఖా స్తులు చేసుకున్నారు. మద్యం షాపులకు వచ్చిన దరఖాస్తులను ఈ నెల 27న కలెక్టర్ల సమక్షంలో డ్రా తీసి.. డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్స్ దారులకు అబ్కారీ శాఖ దుకాణాలను అప్పగించనుంది.