04-10-2025 07:55:00 PM
- మర్రిపల్లి గ్రామం గర్వకారణం అయిన విద్యార్థుల సత్కారం
- ప్రభుత్వ ఉద్యోగాలు, ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులను సత్కరించిన గ్రామస్తులు
కడ్తల్: చదువు ద్వారానే సమాజంలో కీర్తి ప్రతిష్టలు సాధించగలిగి సమాజంలో గుర్తింపు లభిస్తుందని గ్రామస్తులు పేర్కొన్నారు. కడ్తల్ మండలంలోని మర్రి పల్లి గ్రామపంచాయతీలో ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలు, ఎంబీబీఎస్ సీట్లు సాధించిన గ్రామ యువతను గ్రామస్తులు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి, మర్రిపల్లి గ్రామ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో.. సురిగి దినేష్ కుమార్ (తండ్రి: సురిగి జంగయ్య), ఒక్కసారిగా నాలుగు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించిన అరుదైన ప్రతిభావంతుడు.
సురిగి శ్రీజ (తండ్రి: చిన్న యాదయ్య), గ్రామంలో మొదటి ఏంబిబిఎస్ సీటు సాధించిన విద్యార్థిని. ఈర్లపల్లి శ్రావణి (తండ్రి: డీలర్ యాదయ్య), గ్రామంలో రెండవ ఏంబిబిఎస్ సీటు, ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివి విశేష ప్రతిభావంతురాలు. సుంకరి శివకుమార్ (తండ్రి: నర్సింహ), ఓయూలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో 1వ ర్యాంక్. గడిగ పూజ (తండ్రి: రాములు గౌడ్), ఓయూ లో ఎల్.ఎల్.బి ఫస్ట్ ర్యాంక్. మారామోని గ్రీష్మిక (తండ్రి: తిరుపతి), 10వ తరగతిలో 10/10 జిపిఏ సాధించారు.
గ్రామ పెద్దలు, యువత సంఘం ఆధ్వర్యంలో సురిగి శ్రీజ, ఈర్లపల్లి శ్రావణి కి గ్రామం తరఫున ల్యాప్‌టాప్ అందజేయనున్నట్లు తెలిపారు. మిగతా ప్రతిభావంతులైన విద్యార్థులకు మోడల్స్, గిఫ్ట్‌లు త్వరలో అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. యువత పట్టుదల, కృషి క్రమశిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చడానికి వీరే నిదర్శనమని పేర్కొన్నారు. మీ విజయాలు భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తాయని ఆకాంక్షించారు.