19-08-2025 07:17:52 PM
రోడ్డు వేయాలంటూ గ్రామస్తుల నిరసన
రేగొండ,(విజయక్రాంతి): రోడ్డు నిర్మాణం జరపాలంటూ రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరి కొత్తపల్లి మండలం సుల్తాన్ పూర్ గ్రామంలో జరిగింది. సుల్తాన్పూర్ గ్రామం నుండి వెంకటేశ్వర్ల పల్లికి వెళ్లే ప్రధాన రహదారి గత కొన్ని సంవత్సరాలుగా ధ్వంసం అయి దుర్భరంగా మారింది. దీంతో గ్రామస్తులు ఎన్నిసార్లు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు రోడ్డు మరమ్మత్తులు చేయాలని విన్నవించిన పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్డు బుడదమయంగా మారి రైతులకు, విద్యార్థులకు, ప్రయాణికులకు, ఇబ్బందికరంగా మారిందని వాపోయారు. బురదమయంతో ఉన్న రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్న ఎవరూ పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు.