calender_icon.png 19 August, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

తడి హిప్పర్గకు రాకపోకలు ప్రారంభం: తాసిల్దార్ ఎండి ముజీబ్

19-08-2025 07:14:39 PM

మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం తడి హిప్పర్గ గ్రామానికి రాకపోకలు తిరిగి ప్రారంభమైనట్లు తహశీల్దార్ ఎండీ ముజీబ్ తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన సోనాల-తడి హిప్పర్గ గ్రామాల మధ్య ఉన్న రోడ్డును పరిశీలించారు. వరద నీరు పూర్తిగా తగ్గిపోయిందని, వాహనాల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయని తహశీల్దార్ వెల్లడించారు. వర్షాల సమయంలో అధికారులు సకాలంలో చర్యలు తీసుకోవడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.