06-09-2025 01:08:36 AM
నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు బొమ్మినేని
వరంగల్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో పర్యావరణహిత వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి తొమ్మిది రోజులపాటు చాంబర్ అనుబంధ సెక్షన్ల ప్రతినిధులతో పూజలు చేశారు.
శుక్రవారం ఉదయం వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని సెక్షన్ల ప్రతినిధు లు హాజరై గణనాథున్ని వడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేశారు.
కార్యక్రమంలో ఛాంబర్ పూర్వ అధ్యక్షుడు తుమికి రమేశ్‌బాబు, కటకం పెంటయ్య, ఛాంబర్ గౌరవ ప్రధాన కార్యదర్శి మడూరి వేద ప్రకాశ్, సంయుక్త కార్యదర్శి సాగర్ల శ్రీనివాస్, కోశాధికారి అల్లే సంపత్, ఛాంబర్ మెయిన్ బాడీ సభ్యులు, అనుబంధ సెక్షన్ల అధ్యక్ష కార్యదర్శులు, గౌరవ సభ్యులు, గుమస్తా, దడవాయి, వివిధ రకాల హమాలి కార్మిక సోదరులు, భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అధ్యక్షులు ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.