30-08-2025 06:21:47 PM
సదాశివపేట (విజయక్రాంతి): సదాశివపేట పట్టణంలోని శ్రీకృష్ణనగర్ కాలనీలో వీరభద్ర యూత్ ఆధ్వర్యంలో శిల్పారామం తరహాలో మండపాన్ని ఏర్పాటు చేసి మట్టి వినాయక ప్రతిమను ప్రతిష్టించారు. కాలుష్య నియంత్రణ కోసం మట్టి వినాయకుడిని నెలకొల్పడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. వినూత్నంగా ఏర్పాటుచేసిన మండపాన్ని చూసి భక్తులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. వినాయక మండపాన్ని ఏర్పాటుచేసిన వీరభద్ర యూత్ సభ్యులను కాలనీ పెద్దలు అభినందించారు.