31-08-2025 02:01:43 PM
బిజెపి రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్
జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): దేశ ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపై అనుచిత వాక్యాలు చేయటాన్ని నిరసిస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్బంగా రామరాజు మాట్లాడుతూ, బీహార్ లో ఓట్ చోరీ యాత్ర పేరుతో ప్రజలను మోసం చేస్తూ దొంగ పాదయాత్ర చేస్తూన్న రాహుల్ గాంధీ యాత్ర విఫలం కావటంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మీద అక్కసుతో తల్లినీ అవమానం పార్చేలా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయాలకు సంబంధంలేని స్వర్గస్తురాలయన వారిపట్ల మాట్లాడం ఈ దేశంలో మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యాకరి రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలలో తెలుస్తుందన్నారు.
దేశ చట్టాల పట్ల, అవగాహనా లేని రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసి దేశ బహిష్కరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రిలు,మంత్రులు, రాహుల్ గాంధీ వాక్యాల ను కండించి వెంటనే క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖీ, బీజేపీ జిల్లా నాయకులు లకడపురం వెంకటేశ్వర్లు, బుచ్చల నాగరాజు, చాముకురి మహేష్, బోడిగే భరత్, బాసాని కార్తీక్, కటకం మహేష్, లోహిత్ రెడ్డి, రాఘవ, బిల్లా నాయక్, వెంకట్ రెడ్డి,రవి, జానయ్య,, నరేష్, తదితరులు పాల్గొన్నారు.