30-08-2025 06:16:37 PM
మండల ప్రేత్యేక అధికారి సీతారామ్ నాయక్
మోతె: ఓటర్ల లిస్ట్లో అభ్యంతరాలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని మండల ప్రేత్యేక అధికారి సీతారామ్ నాయక్ అన్నారు. శనివారం మండల అభివృద్ధి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిద గ్రామాలలో ఓటర్ లిస్ట్ లోని తప్పులను సరిచేసుకొని డబుల్ ఓట్లు లేకుండా ఆల్ పార్టీల సహాయసహకారాలతో ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా ఒకరికి ఒకరు సహకారంతో చనిపోయిన ఓటర్లను గుర్తించి వార్డుల వారీగా విభజన చేసుకోవాలని వివిధ పార్టీలకు చెందిన మండల నాయకులకు అధికారులకు వివరించారు.